నేను రాముడిలాంటి వాడిని - Thimmarusu Movie Trailer
close
Updated : 27/07/2021 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను రాముడిలాంటి వాడిని

త్యదేవ్‌ హీరోగా శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్‌ కోనేరు, సృజన్‌ నిర్మిస్తున్నారు. ప్రియాంక జవాల్కర్‌ నాయిక. ఈనెల 30న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కథానాయకుడు ఎన్టీఆర్‌ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. విభిన్నమైన కోర్టు డ్రామా కథాంశంతో రూపొందిన చిత్రమిది. ట్రైలర్‌లో సత్య కనిపించిన విధానం.. ఆయన అభినయం ఆసక్తికరంగా ఉన్నాయి. ఆఖర్లో ఓ వ్యక్తి ‘‘నీ ముందు ఉన్నది వాలి అని మర్చిపోకు.. నీ ఎదురుగా ఉండే సగం బలం లాగుతా లాయర్‌ రామచంద్ర’’ అని వార్నింగ్‌ ఇస్తే.. ‘‘నువ్వు సగం బలం లాక్కునే వాలి అయితే, నేను దండేసి దండించే రాముడిలాంటి వాడిని’’ అంటూ సత్యదేవ్‌ దీటుగా బదులివ్వడం హైలైట్‌గా నిలిచింది.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని