చిత్రసీమకు పునర్వైభవం తీసుకురండి
close
Published : 27/07/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్రసీమకు పునర్వైభవం తీసుకురండి

తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా ఎస్‌ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’. ఆర్‌.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 30న థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. దీనికి నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మంచి కంటెంట్‌ ఉన్న చిత్రమిది. కచ్చితంగా మంచి ఫలితం వస్తుందని నేను నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో తెరకెక్కిన చిత్రమిది. అందరూ తెలుగు సినిమాలని ఆదరించి మళ్లీ చిత్రసీమకు పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని