‘పాట’సారులై...
close
Published : 28/07/2021 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పాట’సారులై...

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే సంగీత పనులకు శ్రీకారం చుట్టారు సంగీత దర్శకుడు తమన్‌. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ‘‘మేము మరొక క్రాకింగ్‌ ఫైర్‌ రైడ్‌ కోసం సిద్ధమవుతున్నాము. ఈసారి అది మా ప్రియమైన బాలకృష్ణ చిత్రం కోసం’’ అని ట్వీట్‌ చేశారు. బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రమిది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథాంశంతో రూపొందనుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

తొలి పాట లండన్‌లో..

కథానాయకుడు చిరంజీవి 153వ చిత్రంగా ‘లూసీఫర్‌’ రీమేక్‌ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు రెండో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాటల కంపోజింగ్‌ను షురూ చేసేశారు సంగీత దర్శకుడు తమన్‌. ఆయన ప్రస్తుతం లండన్‌లో ‘చిరు153’ తొలి గీతాన్ని కంపోజ్‌ చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్‌ స్టూడియోలోని వాయిద్యాలతో పని చేస్తున్న ఓ ఫొటోని పంచుకున్నారు. ‘‘ఇది నా లైఫ్‌లో బిగ్‌డే. మెగాస్టార్‌ చిరంజీవి సినిమా కోసం ఫస్ట్‌ సాంగ్‌ రికార్డింగ్‌ చేస్తున్నా. లండన్‌లోని అబ్బె రోడ్‌ స్టూడియోలో 60 ఫిల్‌ గ్రాండ్‌ హార్మోనిక్‌ ఆర్కెస్ట్రాతో ఈ పాటను కంపోజ్‌ చేస్తున్నా’’ అని ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యని జత చేశారు. ఈ సినిమాని కొణిదెలప్రొడక్షన్స్‌, ఎన్వీఆర్‌ ఫిల్మ్స్‌, సూపర్‌బగుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ దోస్తీ

అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో స్నేహం నేపథ్యంలో సాగే గీతం ఒకటి ఉంటుందనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. అది నిజమే అని స్పష్టం చేస్తూ, ఆ పాటని ఆగస్టు 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఆ రోజు స్నేహితుల దినోత్సవం. ‘దోస్తీ...’ అంటూ మొదలయ్యే ఈ పాటని ఒకొక్క భాషలో ఒక్కో గాయకుడు ఆలపించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథా నాయకులుగా, అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని