అన్నిటితోపాటే థియేటర్లని తెరవొచ్చు కదా?
close
Published : 28/07/2021 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నిటితోపాటే థియేటర్లని తెరవొచ్చు కదా?

- నాని

‘‘థియేటర్లో సినిమా చూడటం మన రక్తంలోనే ఉంది. కరోనాలాంటి సందర్భాల్లో అన్నిటికంటే ముందే థియేటర్లు మూసేస్తారు. అన్నిటికంటే చివర్లో తెరుస్తారు. ఆరోగ్యం ముఖ్యమే. కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా స్థలాలకంటే థియేటర్‌ సురక్షితమైనది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు నాని. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘తిమ్మరుసు’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యదేవ్‌, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన చిత్రమిది. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. మహేశ్‌ కోనేరు, సృజన్‌ నిర్మాతలు. చిత్రం ఈ నెల 30న విడుదలవుతోంది. వేడుకలో నాని బిగ్‌ సిడీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘థియేటర్లో సినిమా చూడటం మన సంస్కృతి. థియటర్‌ అనేది పెద్ద పరిశ్రమ. వాటిపై ఎంతోమంది జీవితాలు ఆధారపడ్డాయి. ఇప్పుడు చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అలాగని థియేటర్లు మూసేయకూడదు అని నేను చెప్పడం లేదు. అన్నిటితోపాటే థియేటర్లని కూడా తెరవొచ్చు కదా అంటున్నా. త్వరలోనే పరిస్థితులు మారతాయని నమ్ముతున్నా. ఈ 30 తర్వాత రాబోయే అన్ని   సినిమాలకి ‘తిమ్మరుసు’ ఆక్సిజన్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నా.’’ అన్నారు. సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘రెండో దశ కరోనా తర్వాత వస్తున్న సినిమా ‘తిమ్మరుసు’. మేం చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. వెంకటేశ్‌ మహా, బ్రహ్మాజీ, రాహుల్‌ సంక్రిత్యాన్‌, అంకిత్‌, అప్పు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని