ఒకేసారి... రెండు చిత్రాలతో
close
Published : 29/07/2021 04:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకేసారి... రెండు చిత్రాలతో

ఒకపక్క ‘ఆచార్య’ పనులు కొనసాగుతుండగానే... మరోవైపు ‘లూసిఫర్‌’ రీమేక్‌ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. వచ్చే నెల 13 నుంచే ఆ చిత్రం కోసం రంగంలోకి దిగుతారు చిరు. ‘ఆచార్య’ కోసం ఎక్కువ సమయమే  తీసుకున్న ఆయన, ఇకపై మాత్రం వేగం పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘లూసిఫర్‌’ రీమేక్‌తోపాటు... సమాంతరంగా బాబీ దర్శకత్వం వహించనున్న సినిమానీ చేయాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది. అక్టోబరులోనే బాబీ దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కిస్తారని సమాచారం. ఇప్పటికే బాబీతోపాటు, మెహర్‌ రమేష్‌ చిరు కోసం కథలు సిద్ధం చేసుకుని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించనున్న సినిమాలో చిరుతో పాటు, మరో అగ్ర కథానాయకుడు నటించనున్నారు. ప్రస్తుతం ఆ కథానాయకుడి ఎంపికపైనే కసరత్తులు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని