మహా యాక్షన్‌ సముద్రం
close
Updated : 30/07/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహా యాక్షన్‌ సముద్రం

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా అజయ్‌ భూపతి రూపొందిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్‌ నాయికలు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సినిమాలోని పాత్రల మోషన్‌ పోస్టర్‌ను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రంలో సిద్ధార్థ్‌ గన్‌ పట్టుకుని కనిపించగా.. శర్వానంద్‌ సీరియస్‌గా నడిచొస్తూ దర్శనమిచ్చారు. ‘‘గాఢతతో నిండిన ప్రేమ కథాంశంతో రూపొందిన చిత్రమిది. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. త్వరలో థియేటర్స్‌లో విడుదల చేయనున్నాం’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని