తెరపైకి వెదిరె రామచంద్రారెడ్డి జీవితకథ
close
Published : 31/07/2021 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరపైకి వెదిరె రామచంద్రారెడ్డి జీవితకథ

తెలంగాణ చరిత్రలో వెదిరె రామచంద్రారెడ్డికి ఓ స్థానముంది. పోచంపల్లికి చెందిన ఆయన భూదానోద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. 1951లో ఆచార్య వినోబాభావే అడగగానే.. ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పేదలకు దానమిచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడాయన జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ దర్శకుడు నీలకంఠ. ఈ బయోపిక్‌ను అల్లు అర్జున్‌ మామయ్య కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మిస్తుండగా.. వెదిరె రామచంద్రారెడ్డి మనవడు అరవింద్‌ రెడ్డి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58లక్షల ఎకరాల భూమి పేదలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదొక మహా యజ్ఞంగా సాగింది. ఈ భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామచంద్రా రెడ్డి. అందుకే ఆయన గురించి, పోచంపల్లి భూదాన్‌ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో నటీనటుల్ని ఎంపిక చేసి, చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని