నారప్ప’ నాకెంతో ప్రత్యేకం - వెంకటేష్‌
close
Published : 31/07/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నారప్ప’ నాకెంతో ప్రత్యేకం - వెంకటేష్‌

‘‘థియేటర్లలో చూడాల్సిన ‘నారప్ప’ ఓటీటీలో వచ్చినందుకు ప్రేక్షకులకు బాధగా అనిపించినా.. మా పరిస్థితిని అర్థం చేసుకుని గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా’’ అన్నారు కథానాయకుడు వెంకటేష్‌. ఆయన ప్రియమణితో కలిసి నటించిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించారు. సురేష్‌బాబు, కలైపులి థాను నిర్మించారు. కార్తిక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా ఆనందంగా ఉంది. నా 25ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు చేశాను. కానీ, ఈ సినిమా, ఇందులో నా పాత్ర చాలా విభిన్నమైనది. నటుడిగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెట్రిమారన్‌, ధనుష్‌లకు థ్యాంక్స్‌. వాళ్లు ‘అసురన్‌’ చేయకపోతే.. ఈరోజు ఈ ‘నారప్ప’ లేదు. కచ్చితంగా ప్రేక్షకులందరికీ థియేటర్లో మరో మంచి సినిమా చూపిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా. సంక్రాంతికి ‘ఎఫ్‌3’ సినిమాతో తప్పకుండా వినోదాలు అందిస్తా’’ అన్నారు. ‘‘దేవుడి అనుగ్రహం.. అందరి కష్టం వల్ల గొప్ప విజయం దక్కింది. కొవిడ్‌ పరిస్థితుల వల్ల సినిమా ఓటీటీలోకి వచ్చినందుకు అందరికీ బాధగా అనిపించినా.. ప్రేక్షకుల నుంచి దక్కుతున్న ఆదరణ చూశాక మేం పడ్డ కష్టం వృథా కాలేదనిపించింది’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ చాలా కష్టపడి పని చేశారు. వాళ్ల వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికీ నా థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్‌  రావిపూడి, ప్రియమణి, కార్తిక్‌ రత్నం, రాఖీ, అనంత శ్రీరామ్‌, గాంధీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని