సంక్రాంతికి ‘రాధేశ్యామ్‌’
close
Published : 31/07/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్రాంతికి ‘రాధేశ్యామ్‌’

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’ కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. రానున్న సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 14న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా అదే రోజున ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా... రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్‌, యు.వి.క్రియేషన్స్‌ రూపొందిస్తున్నాయి. వంశీ, ప్రమోద్‌, ప్రసీధ నిర్మాతలు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. వాస్తవానికి జులై 30నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. రెండో దశ కొవిడ్‌ కారణంగా సంక్రాంతికి వాయిదా పడింది. శుక్రవారం చిత్రబృందం కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. రొమాంటిక్‌ ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ ఇంజినీర్‌: రసూల్‌ పోకుట్టి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని