సంక్రాంతికి..సర్కారు పాట
close
Published : 01/08/2021 05:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్రాంతికి..సర్కారు పాట

‘‘సర్కారు వారి పాట’లో మహేష్‌ ఎలా కనిపించనున్నారు? టీజర్‌ వచ్చేదెప్పుడు? సినిమా విడుదల తేదీ ఎప్పుడు?’’.. ఇలాంటి అన్ని ప్రశ్నలకు ‘ఫస్ట్‌ నోటీస్‌’తో సమాధానమిచ్చింది ‘సర్కారు వారి పాట’ బృందం. మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. శనివారం ‘ఫస్ట్‌ నోటీస్‌’ పేరుతో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్‌బాబు ఓ లగ్జరీ రెడ్‌ కలర్‌ కారు నుంచి స్టైల్‌గా బయటకు వస్తూ కనిపించారు. ఇందులో ఆయన పొడవాటి జుట్టు, చెవులకు రింగులు, మెడపైన రూపాయి నాణెం టాటూతో చాలా ట్రెండీగా కనిపించారు. మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9న ‘బర్త్‌ డే బ్లాస్టర్‌’ పేరుతో చిన్న టీజర్‌ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. అలాగే సినిమాని 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఆర్‌.మది ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని