Sundari: అందరికీ నచ్చేలా కొత్తగా మెచ్చేలా
close
Updated : 02/08/2021 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sundari: అందరికీ నచ్చేలా కొత్తగా మెచ్చేలా

టి పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌ జీ గోగన దర్శకుడు. రిజ్వాన్‌ నిర్మించారు. అర్జున్‌ అంబటి కథానాయకుడిగా నటించారు. రాకేందు మౌళి కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. ‘‘స్టార్‌ నాయికలు చేసే పాత్ర ఇది. నేనింకా ఆ స్థాయికి రాలేదు. అయినా నాపై నమ్మకంతో దర్శక నిర్మాతలు నాతో ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. ఈ చిత్రం చాలా కొత్త తరహాలో.. అందరికీ నచ్చేలా ఉంటుంది. నటనలో నాకు నయనతార స్ఫూర్తి. ఆమెలా మంచి నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలనుంది’’ అంది. ‘‘ఓ మనిషితో సరిగా మాట్లాడటానికే భయపడే ఓ  అమాయక అమ్మాయి.. ఊహించని విధంగా ప్రతిస్పందిస్తే ఎలా ఉంటుందన్నది ఈ చిత్ర కథ. మాటల కంటే.. హావభావాలకే ప్రాధాన్యమున్న పాత్ర పూర్ణది. ఆమె ఆ పాత్రని మేం అనుకున్న దానికన్నా బాగా చేసింది’’ అన్నారు దర్శకుడు. హీరో అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘కొత్తవాణ్ని అయినా పూర్ణతో కలిసి ధైర్యంగా నటించగలిగానంటే.. ఆమె అందించిన ప్రోత్సాహమే’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఇన్ని రోజులు ఆగాము. ఇది తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతుంది’’ అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో సురేష్‌బొబ్బిలి, రాకేందు మౌళి, ఖుషి తదితరులు పాల్గొన్నారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని