సునీల్‌... ‘బుజ్జీ.. ఇలా రా’
close
Published : 02/08/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సునీల్‌... ‘బుజ్జీ.. ఇలా రా’

వైవిధ్యభరిత పాత్రలతో సినీ ప్రయాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు నటుడు సునీల్‌. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఇప్పుడాయన హీరోగా ‘గరుడవేగ’ ఛాయాగ్రాహకుడు అంజి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. నటుడు ధనరాజ్‌ మరో కథా  నాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘బుజ్జీ.. ఇలా రా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. విభిన్నమైన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రూపా జగదీశ్‌ సమర్పిస్తున్నారు. చాందిని తమిళరసన్‌ను కథానాయికగా ఖరారు చేశారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సునీల్‌ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తిక్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని