Mrunal Thakur: బాలీవుడ్‌ నుంచి సీత - Introducing Mrunal Thakur as Sita
close
Updated : 02/08/2021 08:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mrunal Thakur: బాలీవుడ్‌ నుంచి సీత

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వప్న మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ సమర్పిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో లెఫ్టినెంట్‌ రామ్‌గా కనిపించనున్నారు కథానాయకుడు దుల్కర్‌. ఇందులోని సీత పాత్రలో బాలీవుడ్‌ భామ మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తోంది. హృతిక్‌  రోషన్‌ ‘సూపర్‌ 30’, జాన్‌ అబ్రహాం ‘బాట్లా హౌస్‌’, ఫర్హాన్‌ అక్తర్‌ ‘తుఫాన్‌’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి హిందీ ప్రేక్షకులకు చేరువైంది మృణాల్‌ ఠాకూర్‌. శనివారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సీత పాత్రకి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘‘రొమాంటిక్‌ చిత్రాల్ని తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘపూడిది ప్రత్యేకమైన శైలి. ఆయన మరో ఆసక్తికరమైన ప్రేమకోణాన్ని ఇందులో స్పృశిస్తున్నారు. దుల్కర్‌, మృణాల్‌ జోడీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభించింది. కశ్మీర్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్‌ డిజైన్‌: సునీల్‌ బాబు, కళ: వైష్ణవిరెడ్డి.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని