నాగ్‌.. యాక్షన్‌ షురూ
close
Published : 03/08/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగ్‌.. యాక్షన్‌ షురూ

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. నారాయణ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఇప్పటికే గోవాలో తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇప్పుడీ చిత్ర రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 4నుంచి ఈ చిత్రీకరణ మొదలు కానున్నట్లు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. భారత్‌లోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాగ్‌ మాజీ ‘రా’ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాజల్‌ ఓ యాక్షన్‌ ప్రాధాన్య పాత్రలో నటిస్తోంది. గుల్‌ పనాంగ్‌, అనైకా సురేంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాబిన్‌ సుబ్బు, నభా మాస్టర్‌ యాక్షన్‌ డైరెక్టర్‌లుగా పని చేస్తున్నారు. ముఖేశ్‌.జి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని