అదంత ఆషామాషీ కాదు
close
Published : 03/08/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదంత ఆషామాషీ కాదు

‘‘ఎప్పుడూ ఒకే పంథాలో నడుస్తానంటే కుదరదు. అనుభవం పెరిగే కొద్దీ కొత్త మార్గాలు అన్వేషించాలి. విభిన్నమైన పాత్రలతో నటనలో సరికొత్త కోణాల్ని స్పృశించగలగాలి’’ అంటోంది రాశీ ఖన్నా. ‘‘నాయికగా సుదీర్ఘ కాలం రేసులో నిలవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కెరీర్‌ ఆరంభంలో ప్రతి నాయిక గ్లామర్‌ పాత్రలతోనో.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనో పేరు తెచ్చుకుని ఉండొచ్చు. అయితే ఓ దశ దాటాక కచ్చితంగా విభిన్న దారుల్లో నడిచేందుకు సిద్ధపడాలి. పదే పదే కమర్షియల్‌ కథల్లోనే నటిస్తామంటే కుదరదు. అలాగే నటనా ప్రాధాన్యమున్న కథాంశాలతోనే ముందుకు సాగుతామన్నా వీలుకాదు. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్తేనే సినీ కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించగలుగుతాం. నటిగా ఓ ఇమేజ్‌లో చిక్కుకుపోకుండా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనపై ఓ ప్రత్యేక ముద్ర ఉండదో.. అప్పుడే కొత్తతరహా కథాంశాలు వెతుక్కుంటూ వస్తాయి’’ అని చెప్పింది రాశి. ప్రస్తుతం ఆమె తెలుగులో నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ‘సర్దార్‌’, ‘తుగ్లక్‌ దర్బార్‌’, ‘అరన్‌మనై3’ లాంటి చిత్రాలతో పాటు హిందీలో షాహీద్‌ కపూర్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని