ఉక్రెయిన్‌లో.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆటపాట
close
Updated : 04/08/2021 04:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉక్రెయిన్‌లో.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆటపాట

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ముగించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు రాజమౌళి. ఆయన ఆఖరి షెడ్యూల్‌ని ఉక్రెయిన్‌లో ప్లాన్‌ చేశారు. ఇందుకోసం ఆయన చిత్ర బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడా మిగిలిన పాటల చిత్రీకరణ కోసం మంగళవారం ఉక్రెయిన్‌కు చేరుకుంది చిత్ర బృందం. ‘‘ఆఖరి షెడ్యూల్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం ఉక్రెయిన్‌లో ల్యాండ్‌ అయింది’’ అంటూ విమాన ప్రయాణ వీడియోని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ షూట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేశారు. విప్లవ వీరులు అల్లూరి సీతా రామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఫిక్షనల్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. అల్లూరిగా చరణ్‌ నటిస్తుండగా.. భీమ్‌ పాత్రను తారక్‌ పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలందిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని