క్రిస్మస్‌కి.. తగ్గేదే లే
close
Published : 04/08/2021 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిస్మస్‌కి.. తగ్గేదే లే

చిత్రసీమలో విడుదల కబుర్ల హంగామా కనిపిస్తోంది. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు లాంటి వారంతా సంక్రాంతి బెర్తులు ఖాయం చేసుకున్నారు. ఇప్పుడు కథానాయకుడు అల్లు అర్జున్‌ వంతు వచ్చింది. ఆయన ‘పుష్ప’తో క్రిస్మస్‌ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో ఈ ఏడాది డిసెంబరులో క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ‘‘పుష్ప పార్ట్‌ 1’ డిసెంబరులో..తగ్గేదే లే’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది. పుష్ప రాజ్‌గా బన్ని ఓ మాస్‌ అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రష్మిక కథానాయిక. పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది. ఈ చిత్ర తొలి గీతాన్ని ఆగస్టు 13న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని