కొంపాకొచ్చి పోరా కోడె నాగ
close
Updated : 05/08/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొంపాకొచ్చి పోరా కోడె నాగ

నాగశౌర్య, రీతు వర్మ జంటగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. తమన్‌ స్వరాలందిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి కొత్త పాటను విడుదల చేశారు. ‘‘దిగు దిగు దిగు నాగ’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ  గీతానికి అనంత శ్రీరామ్‌ సాహిత్యమందించగా.. శ్రేయ ఘోషల్‌ ఆలపించారు. ‘‘కొంపాకొచ్చి పోరా కోడె నాగ... కొంపాముంచుతోందోయ్‌ ఈడు బాగా’’ అని సాగే సాహిత్యం ఆకట్టుకుంటోంది. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చక్కటి కుటుంబ కథాంశంతో సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలు ప్రకటిస్తామ’’ని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని