ఆహ్లాదకరంగా ‘మెరిసే మెరిసే’ - Telugu News Merise Merise Trailer Out Now
close
Updated : 06/08/2021 06:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆహ్లాదకరంగా ‘మెరిసే మెరిసే’

దినేష్‌ తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా కె.పవన్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. వెంకటేష్‌ కొత్తూరి నిర్మించారు. శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు వి.వి. వినాయక్‌ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మంచి బృందంతో చక్కటి ప్రయత్నం చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘యుక్తవయసులోని అమ్మాయి, అబ్బాయిల మనసులు సునిశితంగా ఉంటాయి. అలాంటి వారు కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు.. వాటిని అధిగమించి ఎలా విజయమందుకున్నారు? అన్నది చిత్ర కథ. అందరికీ నచ్చుతుంద’’న్నారు దర్శకుడు. ‘‘సినిమా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నామ’’న్నారు హీరో దినేష్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని