చిరు ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ
close
Published : 17/08/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ

తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైనా..ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్‌ ధరల గురించి చర్చించేందుకు త్వరలోనే సినీ బృందం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా అందింది. ఈ నెలాఖరులో సినీ ప్రముఖులతో కూడిన ఓ బృందం సీఎం జగన్‌ దగ్గరికి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో... అగ్ర కథానాయకుడు చిరంజీవి ఇంట్లో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. జగన్‌ దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాల గురించి ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఏప్రిల్‌ నెలలో టికెట్‌ ధరలపై ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అంశాలు... చిన్న సినిమా మనుగడ కోసం ఐదో ఆట..నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన విభాగాల్లో ఉన్న సమస్యలు..తదితర విషయాలపైన చర్చించారు. ఈ భేటీలో చలన చిత్ర వాణిజ్య మండలి
అధ్యక్షుడు నారాయణదాస్‌ నారంగ్‌తోపాటు హీరో నాగార్జున, ఆర్‌.నారాయణమూర్తి, నిర్మాతలు డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, కె.ఎస్‌.రామారావు, దామోదర్‌ప్రసాద్‌, సి.కల్యాణ్‌, దర్శకులు వి.వి.వినాయక్‌, కొరటాల శివతోపాటు పలువురు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని