‘సిండ్రెల్లా’ సందడి
close
Published : 15/09/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సిండ్రెల్లా’ సందడి

రాయ్‌లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. విను వెంకటేశ్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు మంచాల రవికిరణ్, ఎం.ఎన్‌.రాజు, విశ్వనాథ్‌ రావు. ఈ చిత్రం టీజర్‌ని కథానాయకుడు విజయ్‌ ఆంటోనీ విడుదల చేశారు. ‘‘హారర్‌ ఫాంటసీ, హత్యోదంతం నేపథ్యంలో సాగే చిత్రమిది. టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. ‘సర్కార్‌ 3’, ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ చిత్రాలకి కెమెరా బాధ్యతలు నిర్వర్తించిన రమ్మీ దీనికి ఛాయాగ్రాహకుడు. అశ్వామిత్ర సంగీతం ప్రధాన బలం. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు నిర్మాతలు. రోబో శంకర్‌, అభినయ, అరవింద్‌ ఆకాశ్‌, సాక్షి అగర్వాల్‌, వినోద్‌, అన్బు తదితరులు నటించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని