పెళ్లి కోసం ఢీ - Telugu News PellisandaD Teaser Launch By Nagarjuna
close
Updated : 15/09/2021 10:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి కోసం ఢీ

హస్రతో పెళ్లి కోసం ఆ కుర్రాడు ఎవరెవరితో ఎలా ఢీ కొన్నాడో తెలియాలంటే ‘పెళ్లిసందడి’ చూడాల్సిందే. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీలీల కథానాయిక. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతోపాటు ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు నాగార్జున విడుదల చేశారు. ‘సహస్రకి పెళ్లి నాతోనా? లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్‌లీడర్‌తోనా?’ అంటూ రోషన్‌ చేసే సందడి, రాఘవేంద్రరావు మార్క్‌ సన్నివేశాలు టీజర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అక్టోబర్‌ తొలి వారంలో కానీ, రెండో వారంలో కానీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని