దసరాకి పేరు - Telugu News Nani New Movie Title Announced On Dasara
close
Updated : 17/09/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దసరాకి పేరు

కొత్త దర్శకుల్ని, కొత్తదనం నిండిన కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు కథానాయకుడు నాని. ఇటీవలే ‘టక్‌ జగదీష్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన.. ప్రస్తుతం ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ఇవి చేతిలో ఉండగానే.. ఆయన కొత్త కబురు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం దసరాకి ముహూర్తం ఖరారు చేశారు. నాని చేయనున్న ఈ కొత్త చిత్రంతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్‌ డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాని తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా రోజునే చిత్ర టైటిల్‌తో పాటు ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు. ఈ సినిమాని సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని