డానియల్‌ శేఖర్‌ వస్తున్నాడు - Telugu News Daniel Sekhar Glimpse From Bheemla Nayak Release On Sep 20
close
Updated : 18/09/2021 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డానియల్‌ శేఖర్‌ వస్తున్నాడు

‘భీమ్లా నాయక్‌’గా ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు పవన్‌ కల్యాణ్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాగర్‌ కె.చంద్ర తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రానా మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయన డానియల్‌ శేఖర్‌ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఈనెల 20న ‘బ్లిట్జ్‌ ఆఫ్‌ డానియల్‌ శేఖర్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. దీంట్లో పవన్‌.. భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌గా కనిపించనున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ కనిపించనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని