అవకాశాలు.. పెరిగినాయిక - Telugu news Busy Heroines In 2021
close
Updated : 18/09/2021 10:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవకాశాలు.. పెరిగినాయిక

చిత్రసీమలో కథానాయికలెవ్వరూ ఖాళీగా కనిపించడం లేదు. వాళ్లకు వాళ్లుగా కొంచెం విరామం కావాలి అనుకుంటే తప్ప అందరికీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. కథానాయకులతోపాటు... వాళ్లు చేస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతుండడంతో నాయికలకి వద్దన్నా అవకాశాలే. కనుమరుగైన భామలు కూడా మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. విరమణకి సిద్ధమైన భామలూ ‘ఇంకొన్ని సినిమాలు చేస్తే పోలా’ అంటూ మళ్లీ మేకప్‌ వేసుకుంటున్నారు. ఇక స్టార్‌ భామలు.. కమర్షియల్‌ నాయిక అనే ముద్రపడిన తారలైతే మరింతగా జోరు ప్రదర్శిస్తున్నారు. 

ఎంత మంది కథానాయికలు ఉన్నా... అగ్ర హీరోలకి జోడీ అనగానే ప్రతిసారీ ఓ నలుగురైదుగురు భామలే ప్రముఖంగా కనిపిస్తుంటారు. వాళ్లు కాదంటేనే మిగతావాళ్ల పేర్లు పరిశీలనకొస్తుంటాయి. ఆయా తారలకి
ప్రేక్షకుల్లో క్రేజ్‌... మార్కెట్‌ అలాంటిది. అందుకే అగ్ర కథానాయకులు తరచూ ఆ నలుగురైదుగురు భామలతోనే జోడీ కడుతుంటారు. ప్రతి మూడు నాలుగైదేళ్లకి ఓసారి ఆ కథానాయికల సమూహం మారుతూ ఉంటుంది. ఇప్పుడేమో ఆ సమూహంలో పూజాహెగ్డే, రష్మిక, కీర్తిసురేష్‌, కియారా అడ్వాణీ లాంటి భామలు కనిపిస్తున్నారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోలు కొత్త సినిమా ఖరారు చేశారనగానే, వాళ్లకి జోడీగా ఈ కథానాయికల పేర్లే తెరపైకొస్తుంటాయి. వీళ్లు కుదరదు అన్న తర్వాతే మరో పేరు ప్రస్తావనకొస్తుంటుంది.

ఆ ముగ్గురూ...

మహేష్‌బాబు, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌... ఇలా స్టార్‌ హీరోలందరితోనూ జోడీ కొట్టేసింది పూజాహెగ్డే. ఇక మిగిలింది పవన్‌కల్యాణే. త్వరలోనే ఆయనతోనూ పూజా జోడీ కొట్టేందుకు పచ్చజెండా ఊపేసినట్టు తెలుస్తోంది. హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ చిత్రంలో పవన్‌ సరసన పూజాహెగ్డేనే ఆడిపాడనుందని సమాచారం. ఆమె నటించిన సినిమాలు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్‌’... ఇలా వరుసగా విడుదల కానున్నాయి. ఆమె జోరు తెలుగులోనే అనుకుంటే పొరపాటు. హిందీ, తమిళంలోనూ అవకాశాలు అందుకుంటూ అదరగొడుతోంది. రష్మిక మందన్న కెరీర్‌ బండి టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ఆమె అల్లు అర్జున్‌తో ‘పుష్ప’లో నటిస్తోంది. శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’  నటిస్తోంది. ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో రూపొందనున్న కొత్త చిత్రంతోపాటు పలు కొత్త ప్రాజెక్టుల విషయంలో రష్మిక పేరు వినిపిస్తోంది. మరోపక్క ఆమె హిందీలోనూ జోరు ప్రదర్శిస్తోంది. కీర్తి సురేష్‌ టాప్‌హీరోల సినిమాలకి కేరాఫ్‌గా మారింది. ఆమె ప్రస్తుతం మహేష్‌బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళాశంకర్‌’లోనూ ఆమె చెల్లెలి పాత్రలో సందడి చేయనుంది. పూజా, రష్మిక, కీర్తి... ఈ ముగ్గురితోపాటు ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి అవకాశాల విషయంలో ముందుంది. త్వరలోనే ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో సందడి చేయనున్న ఆమె ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘బంగార్రాజు’, రామ్‌ - లింగుస్వామి చిత్రం, నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో నటిస్తోంది.

కియారా... అలియా

తెలుగులో బాలీవుడ్‌ భామలు సందడి చేయడం కొత్తేమీ కాదు. కానీ ఒకట్రెండు సినిమాలకి పరిమితమైనవాళ్లే ఎక్కువ. కియారా అడ్వాణీ తెలుగు మేకర్లకి టాలీవుడ్‌ హీరోయిన్‌లాగే కనిపిస్తోంది. అగ్ర హీరోల సినిమాల కోసం ఆమెని తరచూ సంప్రదిస్తుంటారు. ఇటీవల ఆమె రామ్‌చరణ్‌ - శంకర్‌ సినిమాలో అవకాశం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న అలియాభట్‌, త్వరలోనే మరో సినిమాకీ పచ్చజెండా ఊపే అవకాశాలున్నాయని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో సినిమా విషయంలోనే ఆమె కూడా వినిపిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని