సాఫ్ట్‌వేర్‌ ప్రేమ కథ
close
Published : 22/09/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాఫ్ట్‌వేర్‌ ప్రేమ కథ

‘ఓ పిట్టకథ’ చిత్రంతో తెరకు పరిచయమయ్యారు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు. ఇప్పుడాయన హీరోగా జై దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘ప్రేమిస్తే ఇంతే’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. వెంకట రత్నం నిర్మాత. అనితా షిండే నాయిక. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నేపథ్యంలో సాగే హైఫై లవ్‌స్టోరీ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమాలో సంజయ్‌ ఓ లవర్‌ బాయ్‌లా కనిపిస్తాడు. అతని పాత్ర అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం అందిస్తామ’’న్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని