విష్ణు జట్టు సిద్ధం - Telugu News Manchu Vishnu Announced His Pannel For MAA Elections
close
Updated : 24/09/2021 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విష్ణు జట్టు సిద్ధం

‘మా’ కోసం మనమందరం అంటూ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల బరిలో నిలవనున్నారు మంచు విష్ణు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఆయన తన జట్టుని గురువారం ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా బాబు మోహన్‌, ఉపాధ్యక్షులుగా మాదాల రవి, పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి, కోశాధికారిగా శివబాలాజీ, సహాయ కార్యదర్శులుగా కరాటే కల్యాణి, గౌతమ్‌రాజు ఎన్నికల బరిలో నిలవనున్నారు. కార్యవర్గ సభ్యులుగా అర్చన, అశోక్‌కుమార్‌, గీతాసింగ్‌, హరినాథ్‌బాబు, జయవాణి, మలక్‌పేట్‌ శైలజ, మాణిక్‌, పూజిత, రాజేశ్వరీరెడ్డి, సంపూర్ణేశ్‌బాబు, శశాంక్‌, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు.పి, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల.ఎమ్‌.ఆర్‌.సి, రేఖ తదితరులు పోటీ చేస్తున్నారు. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి ప్యానెళ్లమధ్యే గట్టి పోటీ నెలకొంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని