డార్క్‌ సెంట్రిక్‌ థీమ్‌ టెక్నాలజీతో - Telugu News Prabhas Starer Salaaar Using Dark Centric Theme In SALAAR
close
Updated : 26/09/2021 07:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డార్క్‌ సెంట్రిక్‌ థీమ్‌ టెక్నాలజీతో

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న యాక్షన్‌ డ్రామా చిత్రం ‘సలార్‌’. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం కోసం ‘డార్క్‌ సెంట్రిక్‌ థీమ్‌’ అనే ఓ హాలీవుడ్‌ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారట దర్శకుడు ప్రశాంత్‌. ‘టెనెట్‌’, ‘బ్యాట్‌మెన్‌’, ‘మ్యాట్రిక్స్‌’ లాంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు వినియోగించిన టెక్నాలజీ ఇది. ఇప్పుడా టెక్నాలజీని తొలిసారి భారత్‌లో ‘సలార్‌’ కోసం వాడుతున్నట్లు సమాచారం. మరి ఇది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యమున్న చిత్రమిది. ఇందులో ప్రభాస్‌ ఓ శక్తిమంతమైన అవతారంలో కనిపించనున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంగీతం: రవి బస్రుర్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని