వారం ఆలస్యంగా బ్యాచ్‌లర్‌
close
Published : 27/09/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారం ఆలస్యంగా బ్యాచ్‌లర్‌

రో వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాని మొదట అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం సినిమాని మరో వారం వాయిదా వేస్తూ, అక్టోబర్‌ 15న విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్లని విడుదల చేశారు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించిన సినిమా ఇది. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. ఆమని, మురళిశర్మ, జయప్రకాశ్‌, ప్రగతి, సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, అభయ్‌, అమిత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, ఛాయాగ్రహణం: ప్రదీశ్‌ ఎమ్‌.వర్మ.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని