నా మేనిఫెస్టోపై అంత నమ్మకం ఉంది - Telugu News Manchu Vishnu And His Members File Nominations
close
Updated : 29/09/2021 07:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా మేనిఫెస్టోపై అంత నమ్మకం ఉంది

‘‘మా ఎన్నికల్లో ఓటు వేసే 900 మంది సభ్యుల మద్దతు నాకు ఉంది. నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి... పవన్‌కల్యాణ్‌ నాకే ఓటేస్తారు. నా మేనిఫెస్టోపై అంత నమ్మకం ఉంది’’ అన్నారు మంచు విష్ణు. ఆయన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి మంగళవారం నామినేషన్‌ వేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికలు తెలుగు సినీ నటుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని ముందే చెప్పా. కానీ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. త్వరలోనే మేనిఫెస్టోని ప్రకటిస్తాం’’ అన్నారు మంచు విష్ణు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఆయన అన్నారు. ‘‘పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రకటన విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాకు రెండు కళ్లు అని మండలి ప్రకటించింది. తెలుగు పరిశ్రమ బిడ్డగా, నిర్మాతగా, నటుడిగా చలన చిత్ర వాణిజ్య మండలితోనే మేముంటాం. అందుకే పవన్‌ వ్యాఖ్యల్ని ఏకీభవించడం లేదు. మరి ఈ విషయంలో ప్రకాశ్‌రాజ్‌ తెలుగు పరిశ్రమతో ఉన్నారా? పవన్‌కల్యాణ్‌ పక్కన ఉన్నారా? అనేది కచ్చితంగా చెప్పాలి’’ అన్నారు విష్ణు.

‘‘నిర్మాతల అభిప్రాయాలకి కట్టుబడి ఉంటామని, నిర్మాతలే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆయనతో సమావేశానికి వెళ్లిన పరిశ్రమ ప్రతినిధులే ఆ విషయంపై మాట్లాడితే బాగుటుంది. పరిశ్రమ పెద్దలు ఇప్పటికే చర్చలు ప్రారంభించార’’ని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు ప్యానెల్‌ నుంచి పోటీ చేస్తున్న నటులు పాల్గొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని