క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో..
close
Updated : 17/10/2021 04:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో..

ది సాయికుమార్‌ హీరోగా శివ శంకర్‌ దేవ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మాత. అలీ రాజా, నందిని రాయ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పుస్కూర్‌ రామ్మోహనరావు క్లాప్‌ నివ్వగా..   కె.ఎస్‌.రామారావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘కథని నమ్మి ముందుకెళ్తున్నాం. హీరోయిన్‌తో పాటు మిగిలిన వివరాలు త్వరలో  తెలియజేస్తామ’’న్నారు. ‘‘ఇదొక క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌. ఆది పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు, లగడపాటి శ్రీధర్‌, సాయికుమార్‌   తదితరులు పాల్గొన్నారు. 


సాయికుమార్‌.. ‘నాతో నేను’

సాయికుమార్‌, సాయి శ్రీనివాస్‌, ఐశ్వర్య, విజయ్‌ చందర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో శాంతి కుమార్‌ తుర్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ క్లాప్‌నిచ్చారు. ఆది సాయికుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఇందులో అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు.


 


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని