Cinema News: అదే పదివేల కోట్లు - telugu news Heavy Expectations On Cinema Industry Income In 2022
close
Updated : 18/10/2021 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: అదే పదివేల కోట్లు

2022లో చిత్రసీమ సంపాదనపై అంచనా

సినీ వ్యాపార వర్గాల్లో కళ

కరోనా కొట్టిన దెబ్బ చిత్ర పరిశ్రమకు చాలా బలంగా తగిలింది. ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకున్నాయి. కొన్ని చోట్ల ఇంకా లేదు. భారతీయ చిత్ర పరిశ్రమకు కీలకంగా నిలిచే మహారాష్ట్రలో ఈ నెల 22 తర్వాత థియేటర్లు తెరచుకోనుండటంతో సినిమాలు వరస కడుతున్నాయి. ఈ నెలాఖరుకి సుమారు అన్నిచోట్లా థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నాలుగు నెలల కాలంలో వంద సినిమాలకు పైగా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో  భారతీయ చిత్ర పరిశ్రమ ఒకప్పటి వైభవంతో కొత్తకాంతులు విరజిమ్ముతుందని అందరి నమ్మకం. ఆ దిశగానే హిందీ చిత్రసీమతో పాటు ఇతర భాషా సినీ పరిశ్రమలూ వేగంగా అడుగులు వేస్తున్నాయి.

కరోనా రాకముందు అంటే 2019లో భారతీయ చిత్ర పరిశ్రమకు కాసుల పంట పండింది. అన్ని భాషల్లోనూ కలిసి సుమారు రూ.10,000 కోట్లు ఆ ఏడాదిలో వచ్చాయి. వచ్చే ఏడాది కచ్చితంగా అలాంటి భారీ మొత్తాన్ని చిత్రసీమ చూస్తుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.

* వచ్చే నాలుగు నెలల్లో ప్రతివారం తక్కువలో తక్కువ 5 నుంచి 6 చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిల్లో కనీసం రెండైనా భారీ అంచనాలున్నవి.

* ఈ ఏడాది చివరి నాటికి సుమారుగా రూ.4000 - 6000 కోట్లు బాక్సాఫీసు వద్ద వసూళ్లు దక్కనున్నట్టు ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

* నాలుగు నెలల కాలంలో రానున్న చిత్రాల్లో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి రెండో వారం కచ్చితంగా ఒకటి లేదా రెండు భారీ విజయాలు సాధించడం ఖాయం అని అంచనా.

* ఈ నెల 23 నుంచి మహారాష్ట్రలో థియేటర్లు తెరిచాకా లెక్కేసుకుంటే దేశం మొత్తంలో 98శాతం తెరలు అందుబాటులోకి వచ్చేస్తాయి. మొత్తంగా 3000 మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు సందడి చేయనున్నాయి.

* ‘‘వారం వారానికి విడుదలయ్యే సినిమాల సంఖ్య, ఆదాయం 25 శాతం పెరగనుంది. కనీసం ప్రతి రెండు వారాలకు ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఖాయం. ఇది మరింత పెరగొచ్చు కూడా’’అంటున్నారు మల్టీప్లెక్స్‌  అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ కమల్‌ జ్ఞాన్‌చందాని.

* గత ఏడాది మార్చి వరకే థియేటర్లు తెరచుకోవడంతో ఆదాయం రూ.2000 కోట్లు మించలేదు. ఈ ఏడాది ఇంకా మూడు నెలలు ఉంది కాబట్టి విడుదల కాబోయే సినిమాలు కూడా భారీ చిత్రాలు కావడంతో 2021లో రూ.6000కోట్లు కచ్చితంగా వస్తాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

* ఈ నెల 23 తర్వాత మహారాష్ట్రలో 1000 తెరలు అందుబాటులోకి రానుండటంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని