Hansika: ఉత్కంఠకు గురి చేసే.. శృతి - telugu news new Look From My Name Is Shruti Out now
close
Updated : 18/10/2021 06:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hansika: ఉత్కంఠకు గురి చేసే.. శృతి

‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ అంటూ సినీప్రియుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది నటి హన్సిక. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 85శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి కొత్త లుక్‌ పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా హన్సిక కనిపిస్తుంద’’న్నారు. ‘‘ఇప్పటి వరకు హైదరాబాద్‌, వైజాగ్‌లలో చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన షూట్‌ను భాగ్యనగరంలోనే పూర్తి చేస్తామ’’న్నారు నిర్మాత.  మురళి శర్మ, జయప్రకాష్‌, పూజా రామచంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: మార్క్‌ రాబిన్‌, ఛాయాగ్రహణం: కిషోర్‌ బోయిడపు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని