‘గీత’ రాత మార్చిందా?
close
Published : 19/10/2021 05:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గీత’ రాత మార్చిందా?

ప్రముఖ నటుడు సునీల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘గీత’. సాయికిరణ్‌ ప్రతినాయకుడిగా నటించారు. హెబ్బా పటేల్‌ ముఖ్యభూమిక పోషించారు. వి.వి.వినాయక్‌ శిష్యుడు విశ్వా.ఆర్‌.రావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్‌.రాచయ్య నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘అనాథల కోసం పోరాటం చేసే ఓ యువతి కథ ఇది. అనాథల రాత మార్చాలని కంకణం కట్టుకున్న గీత అనే యువతి ఏం చేసింది? ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేది తెరపైనే చూడాలి. మూగ యువతిగా సవాల్‌తో కూడిన పాత్రలో హెబ్బా కనిపిస్తుంది’’ అని సినీ వర్గాలు చెప్పాయి.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని