Sudeep: సుదీప్‌.. కోటికొక్కడు - telugu news sudeep starer k3 trailer out now
close
Updated : 20/10/2021 07:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sudeep: సుదీప్‌.. కోటికొక్కడు

కిచ్చ సుదీప్‌ కథానాయకుడిగా శివ కార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం ‘కె3’. కోటికొక్కడు.. అన్నది ఉపశీర్షిక. శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు. మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధా దాస్‌, ఆషిక కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో సుదీప్‌ రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించారు. ఓవైపు మాస్‌గా కనిపిస్తూనే.. మరోవైపు స్టైలిష్‌ యాక్షన్‌తోనూ మెప్పించారు. ట్రైలర్‌లో కనిపించిన పోరాట ఘట్టాల్ని బట్టి.. సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ‘‘లైఫ్‌లో రెండు పాఠాలు నేర్చుకున్నా బంగారం. ఒకటి ఓవర్‌గా మాట్లాడకూడదు. ఇంకొకటి ఓవర్‌గా మాట్లాడేదాన్ని విననూ కూడదు’’ అని ట్రైలర్‌లో సుదీప్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు  జరుపుకొంటోన్న ఈ సినిమా నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని