ఆ రోజుల్ని గుర్తు చేసేలా... - telugu news First Look Of Tenth Class Diaries Launched By Krish
close
Updated : 21/10/2021 07:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రోజుల్ని గుర్తు చేసేలా...

శ్రీరామ్‌, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. ఛాయాగ్రాహకుడు ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించారు. అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘విజయదశమికి మా సినిమా పేరుని ప్రకటించాం. చాలా మంది పేరు బాగుందని మెచ్చుకున్నారు. ప్రేక్షకుల్ని వాళ్ల పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే చిత్రమిది. అవికా, శ్రీరామ్‌ గుర్తుండిపోయే పాత్రల్లో కనిపిస్తారు. కథ ప్రకారం హైదరాబాద్‌, చిక్‌ మంగళూరు, రాజమండ్రి, అమెరికాలో చిత్రీకరణ చేశాం. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. పేరు, సినిమా ఫస్ట్‌లుక్‌కి లభిస్తున్న స్పందన ఎంతో సంతోషాన్నిచ్చింది. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో టెన్త్‌ క్లాస్‌ అనేది ఒక మలుపు. స్నేహం, ఆకర్షణ, ప్రేమ, జీవిత లక్ష్యాలు, కలలు... అన్నిటికీ పునాది ఇక్కడే పడుతుంది. ప్రతి ఒక్కరికీ టెన్త్‌ క్లాస్‌ రోజుల్ని గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివ బాలాజీ, మధుమిత, సత్యం రాజేష్‌, భానుశ్రీ, నాజర్‌, శివాజీరాజా, రాజశ్రీ నాయర్‌, సత్యకృష్ణ, రూపలక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: రామారావు, కథనం, సంభాషణలు: శ్రుతిక్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని