varudu Kavalenu: ‘వరుడు కావలెను’ చేసినందుకు గర్వపడుతున్నా - telugu news varudu kavalenu trailer out now
close
Updated : 22/10/2021 07:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

varudu Kavalenu: ‘వరుడు కావలెను’ చేసినందుకు గర్వపడుతున్నా

నాగశౌర్య

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం హైదరాబాద్‌లో హీరో రానా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాగశౌర్యకు సరిగ్గా సరిపోయే టైటిల్‌ ఇది. తను చాలా అందంగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఈ వరుడికి పెళ్లయిపోతుందని నమ్ముతున్నా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘సినిమా పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి శౌర్య. దర్శకులకు ఏం కావాలన్నది తనకి బాగా తెలుసు. ఈ కథ అనుకున్నప్పుడు తనకే బాగుంటుందనుకున్నా. అందుకే స్క్రిప్ట్‌ తొలుత తనేకే చెప్పా’’ అన్నారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చేసినందుకు చాలా గర్వపడుతున్నా. కుటుంబమంతా కలసి హాయిగా చూడగలిగేలా ఉంటుంది. ఈ చిత్రంలో మా నోటి నుంచి వచ్చిన మాటలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అదంతా గణేష్‌ రావూరి ఇచ్చిన సంభాషణల వల్లే. విశాల్‌ మంచి స్వరాలందించారు. వంశీ పచ్చిపులుసు సినిమాలో ప్రతి ఒక్కరినీ చాలా అందంగా చూపించారు. నన్నెంత ప్రేమించిందో.. సినిమాని అంతే ప్రేమించింది లక్ష్మీ సౌజన్య అక్క. రీతూ చాలా బాగా చేసింది. కథకి ఎంత కావాలో.. అంతిచ్చారు నిర్మాతలు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్‌కి రండి. సినిమాని బతికించండి’’ అన్నారు. ‘‘ఇదొక కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరం మెచ్చేలా ఉంటుంద’’న్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని