Cinema News: ఛలో ఛలో - telugu news Chalo Premiddam First Look Launched By Gopichand Malineni
close
Updated : 25/10/2021 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఛలో ఛలో

సాయి  రోనక్‌, నేహా సోలంకి జంటగా సురేశ్‌ శేఖర్‌ రేపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఉదయ్‌ కిరణ్‌ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని ఆదివారం హైదరాబాద్‌లో దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఒక రోజు దర్శకుడు ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని నాకు చూపించారు. చాలా నచ్చింది. అందుకే ఈ రోజు ఈ వేడుకకి వచ్చాను. అందరూ ఈ సినిమా నిర్మాత గురించి చెబుతుంటే నాకు నా తొలి సినిమా నిర్మాత వెంకట్‌ గుర్తొచ్చారు. ఉదయ్‌ కిరణ్‌ నిర్మాతగా మంచి స్థాయికి ఎదుగుతారు. సంగీత దర్శకుడు భీమ్స్‌ ఎప్పట్లాగే మంచి పాటలు ఇచ్చుంటారని ఆశిస్తున్నా’’నన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. శశాంక్‌ మంచి పాత్ర పోషించారు. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు. నవంబర్‌ నెలాఖరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్‌, నటుడు శశాంక్‌, పాటల రచయితలు దేవ్‌, సురేష్‌ గంగుల, సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో, నృత్య దర్శకుడు దీప్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని