Liger: ‘లైగర్‌’ మాస్‌ - telugu news Liger Song Shoot kick started at mumbai
close
Updated : 26/10/2021 07:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Liger: ‘లైగర్‌’ మాస్‌

మునుపెన్నడూ లేని రీతిలో విజయ్‌ దేవరకొండ తన డ్యాన్స్‌తో అలరించనున్నాడంటూ ఊరిస్తోంది ‘లైగర్‌’ బృందం. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. అనన్య పాండే నాయికగా నటిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో పూరి కనెక్ట్స్‌తో కలిసి, ధర్మ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా నిర్మాతలు. హిందీ, తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్‌లో విజయ్‌ దేవరకొండపై ఓ మాస్‌ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌లోని అసలు సిసలు డ్యాన్సర్‌ని ఈ పాటతో చూస్తారంటూ నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్వీట్‌ చేశారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్‌రాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని