RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథా సారమే ‘జనని’ పాట - telugu news janani song released from rrr
close
Updated : 26/11/2021 07:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథా సారమే ‘జనని’ పాట

డిసెంబర్‌ తొలివారంలో ట్రైలర్‌

దర్శకుడు రాజమౌళి

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర కథా సారం మొత్తం చెబుతూ సాగే గీతమే ‘జనని... ప్రియభారత జనని’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఈ గీత ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ... ‘‘మీకు నాకు మధ్య చాలా సంవత్సరాలు గ్యాప్‌ వచ్చింది. ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలి. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. అయితే... ఈ పాట ఎంతో భావోద్వేగంతో నిండినిది. అందుకే సూటిగా ఈ పాట గురించే మాట్లాడతాను. ఈ సినిమా నుంచి మనం ఏం చెబుతున్నాం? అని ఆలోచించాం. ఆ ప్రశ్నకు సమాధానంగానే ‘జనని’ పాట పుట్టింది. దీన్ని కీరవాణే రాశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆత్మ ఇందులో ప్రతిబింబిస్తుంది. మెలోడీగా సాగే ఈ గీతాన్ని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. డిసెంబర్‌ మొదటి వారంలో చిత్ర ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు. నిర్మాణానంతర పనులు జరుపుకొంటున్న ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని