కియారా, సిద్ధార్థ్‌ ప్రేమలో ఉన్నారా..?
close
Published : 04/01/2020 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కియారా, సిద్ధార్థ్‌ ప్రేమలో ఉన్నారా..?

ముంబయి: ‘ఫగ్లీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ ‘ఎం.ఎస్‌.ధోనీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కియారా అడ్వాణీ. ‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. తాజాగా ఈ చిన్నది న్యూ ఇయర్‌ సందర్భంగా షూటింగ్‌ నుంచి కొంత విరామం తీసుకుని ఆఫ్రికా టూర్‌ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా కూడా ఆఫ్రికాలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు. దీంతో కియారా, సిద్ధార్థ్‌ కలిసే టూర్‌కు వెళ్లారంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆఫ్రికా నుంచి ముంబయికు చేరుకున్న కియారా అడ్వాణీ పక్కనే సిద్ధార్థ్‌ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

గతేడాది విడులైన ‘కబీర్‌సింగ్‌’, ‘గుడ్‌న్యూస్‌’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు కియారా అడ్వాణీ. ప్రస్తుతం ఆమె కిట్టీలో ‘లక్ష్మిబాంబ్‌’, ‘ఇండోకి జనానీ’, ‘షెర్‌షా’ చిత్రాలు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని