‘మన్మథుడు’లో సుదీప్‌ కాదుఅరవింద్‌ స్వామి?
close
Published : 10/01/2020 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మన్మథుడు’లో సుదీప్‌ కాదుఅరవింద్‌ స్వామి?

చెన్నై: తమిళ నటుడు శింబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మథుడు’. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రతి నాయకుడిగా కిచ్చా సుదీప్‌ నటించనున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఎంటువంటి స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో అరవింద్‌ స్వామి పేరు వినిపిస్తోంది. రాజకీయ నేపథ్యంలో పవర్‌ఫుల్‌గా సాగే కథ కావడంతో అరవింద్‌ స్వామి అయితే బావుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ మేరకు అరవింద్‌ను సంప్రదించగా ఆయన కూడా విలన్‌ పాత్రలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు శింభుకు విలన్‌గా నటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. గతంలో అరవింద్, శింభు.. మణిరత్నం తెరకెక్కించిన ఓ తమిళ సినిమాలో సోదరులుగా నటించిన విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని