శిరీష్‌.. సాయితేజ్‌.. ఇప్పుడు వరుణ్‌ తేజ్..?
close
Published : 10/01/2020 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శిరీష్‌.. సాయితేజ్‌.. ఇప్పుడు వరుణ్‌ తేజ్..?

హైదరాబాద్‌: ఇటీవల విడుదలైన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా విజయం తర్వాత ఆయన ఏ హీరోతో చేయబోతున్నారా? అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన అల్లు శిరీష్‌ , సాయితేజ్‌లను డైరెక్ట్‌ చేసిన మారుతి మరోసారి మెగా హీరోతోనే సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మెగా హీరో ఎవరో కాదండీ.. వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ‘బాక్సర్‌’ సినిమాలో బిజీగా ఉన్న వరుణ్‌ త్వరలో మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారంటూ టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఎంతవరకూ నిజమో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని