తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో మంచులక్ష్మి..?
close
Published : 10/01/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో మంచులక్ష్మి..?

హైదరాబాద్‌: ‘పెళ్లి చూపులు’ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. ఇటీవల కథానాయకుడిగా మారిన తరుణ్‌ త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనున్నారట. అయితే ఇందులో మంచులక్ష్మి నటించనున్నారట. ఇప్పటికే బుల్లితెర వ్యాఖ్యాతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచులక్ష్మి గతంలో ‘మిసెస్‌ సుబ్బలక్ష్మి’ అనే సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రాజకీయ నేపథ్యంలో సాగే కథతో తరుణ్‌ ఓ వెబ్‌ సిరీస్‌ చేయాలనుకుంటున్నారట. ఈ కథ కోసం మంచులక్ష్మిని అనుకుంటున్నారట. గతంలో తరుణ్‌ తీసిన ‘సైన్మా’ అనే లఘు చిత్రం చూసిన లక్ష్మీ.. ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నారు. ‘పెళ్లి చూపులు’ చిత్రానికంటే ముందు తరుణ్‌ దర్శకత్వంలో లక్ష్మి నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదని, ఈ కాంబినేషన్‌ ఇన్నేళ్లకు కుదురుతుందని టాలీవుడ్‌ టాక్‌.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని