వికారాబాద్ అడవుల్లో రామ్‌చరణ్‌..!
close
Published : 11/01/2020 20:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వికారాబాద్ అడవుల్లో రామ్‌చరణ్‌..!

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి.. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా కనిపించనున్నారనే విషయం తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్‌పై అరకులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన చిత్రబృందం తాజాగా రామ్‌చరణ్‌పై వికారాబాద్‌ అడవుల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక్కడ చెర్రీపై యాక్షన్‌ సన్నివేశాలను షూట్‌ చేయనున్నారట. అయితే వారం రోజులపాటు ఈ షూట్‌లో రామ్‌ చరణ్‌ పాల్గొననున్నారని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా రాత్రి వేళ అధిక భాగం తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో తారక్‌పై సన్నివేశాలుండవని టాక్‌. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని