‘మహాసముద్రం’లోకి ‘జాను’ జంట?
close
Published : 16/01/2020 17:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మహాసముద్రం’లోకి ‘జాను’ జంట?

హైదరాబాద్‌: ‘జాను’.. హృదయాన్ని హత్తుకునే ఈ ప్రేమకథతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు శర్వానంద్, సమంత. తమిళంలో విజయం అందుకున్న ‘96’ చిత్రానికి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. మరోసారి ఈ జంట కలిసి నటించబోతున్నాంటూ సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే సినిమా అంటే... ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి గతంలో ‘మహా సముద్రం’ అనే క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయకులకు అవకాశం ఉందట. ఈ నేపథ్యంలోనే రవితేజ, నాగ చైతన్య, కార్తికేయ, విశ్వక్‌సేన్‌ పేర్లు వినిపించినప్పటికీ స్పష్టత లేదు.

తాజాగా శర్వానంద్‌.. అజయ్‌ భూపతి దర్శకత్వంలో నటిస్తున్నాడని టాలీవుడ్‌ టాక్‌. ఇప్పటికే ఈ విషయంపై ఇద్దరి మధ్య చర్చలు సాగాయని, దాదాపు ఖరారయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరో కథానాయకుడి కోసం అన్వేషిస్తుందట చిత్ర బృందం. అంతేకాదు ఈ చిత్రంలోనే శర్వానంద్‌ సరసన సమంత కనిపించబోతుందని అంటున్నాయి చిత్ర సీమ వర్గాలు. ఇప్పటికే విడుదలైన ‘జాను’ ఫస్ట్‌లుక్, టీజర్‌తో అంచనాలు పెంచుతున్నారు శర్వా, సామ్‌. ఇప్పుడు మరో చిత్రంలో కలిసి నటించబోతున్నారనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని