ఆ హీరో సినిమా నుంచి కీర్తి తప్పుకొన్నారా?
close
Published : 17/01/2020 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హీరో సినిమా నుంచి కీర్తి తప్పుకొన్నారా?

ముంబయి: దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కూడా పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘మైదాన్‌’లో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వెల్లడించారు. బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1952 నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ఇది. కాగా, ఈ ప్రాజెక్టు నుంచి కీర్తి సురేశ్‌ తప్పుకొన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె, బోనీ పరస్పరం ఒప్పందానికి వచ్చారట. సినిమాలోని పాత్రకు కీర్తి సురేశ్‌ సరిపోవడం లేదని తెలిసింది. అజయ్‌ భార్య పాత్రకు తగినట్లు లేరని, చాలా తక్కువ వయసు అమ్మాయిలా కనిపిస్తున్నారని చెబుతున్నారు. బాలీవుడ్‌ ఎంట్రీకి ఇది సరైన సినిమా కాదని కీర్తి అభిప్రాయపడ్డారట. ఈ నేపథ్యంలో ఆమె చిత్రం నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

‘మైదాన్‌’ను ప్రకటించినప్పుడు కీర్తి సురేశ్‌ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు నా పాత్ర గురించి మాట్లాడకూడదు. కానీ అందరికీ తెలియని ఈ కథలో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది. ఇది అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించే ఓ భావోద్వేగపు ప్రయాణం’ అని అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని