‘రంగమ్మత్త’ మరో ఛాన్స్‌ కొట్టేసిందా?
close
Published : 18/01/2020 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రంగమ్మత్త’ మరో ఛాన్స్‌ కొట్టేసిందా?

హైదరాబాద్‌: ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ విజయంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర విరామం తీసుకున్న ఆయన మరోసారి అలాంటి తప్పు చేయనని ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో తన తర్వాత చిత్రాన్ని శరవేగంగా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బన్నీ ‘వైకుంఠపురములో’ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఆయన లేని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట సుకుమార్. ఇక త్వరలోనే బన్నీ కూడా తన కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారు. 

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఇప్పుడీ చిత్ర కథా నేపథ్యానికి తగ్గట్లుగానే ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను పెట్టాలని అనుకుంటోందట. ఈ సినిమాకు‘శేషాచలం’ అని పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉందట. ఈ చిత్ర కథ అంతా శేషాచల అడవుల చుట్టూనే తిరుగుతుండటంతో టైటిల్‌గా ఇదే ఖరారు చేసుకుంటే బాగుంటుందని సుకుమార్‌ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బన్నికి జోడీగా రష్మిక కనిపించనుండగా.. బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ ‘రంగమ్మత్త’గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆమె నటనకు విమర్శకుల నుంచీ ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇందులోనూ ఒక చక్కని పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని