సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..?
close
Published : 19/01/2020 21:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..?

హైదరాబాద్‌: పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకూ కనిపించని లుక్‌లో బాలకృష్ణ దర్శనమివ్వడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. గుండు చేయించుకుని, మీసాలు పెంచి, వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. అయితే, ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ దిగారనే విషయం మాత్రం తెలియరాలేదు. 

దీన్ని చూసిన నెటిజన్లు, అభిమానులు మాత్రం దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించే చిత్రం కోసం ఇలా తయారయ్యారని అంటున్నారు. ‘పాత్ర కోసం బాలయ్య ఏదైనా చేస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం, ఇది కదా మేం కోరుకుంది, ఈ లుక్‌లో అదరగొడుతున్నార’ని కామెంట్స్‌ పెడుతున్నారు. మరి అభిమానులు అనుకుంటున్నట్లు బోయపాటి చిత్రం కోసం ఇలా తన లుక్‌ మార్చారా? వ్యక్తిగతంగా కొత్త లుక్‌ ప్రయత్నించారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని