ప్రభాస్‌ తల్లిగా అగ్రతార..?
close
Published : 22/01/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ తల్లిగా అగ్రతార..?

హైదరాబాద్‌: ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘సాహో’ చిత్రాల్లో నటించిన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘జాన్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. 

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వింటేజ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ అతిథి పాత్రలో నటించనున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా ఒకప్పటి అగ్రకథానాయిక భాగ్యశ్రీ నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందట. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం భాగ్యశ్రీని సంప్రదించగా, ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు టాలీవుడ్‌లో రూమర్స్‌ వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాతో చిత్రపరిశ్రమలో నటిగా భాగ్యశ్రీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ నటిస్తున్నారో లేదో తెలియాలంటే చిత్రబృందం అధికారక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని